వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు అన్నారు. ఈ మేరకు శనివారం అడిషనల్ ఎస్పీని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ. వైసీపీ అధికారంలో పెట్టిన పోస్టింగ్లను ఇప్పుడు పెట్టినట్లుగా చిత్రీకరించి పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమన్నారు. కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పడం లేదన్నారు.