ఏలూరు జిల్లాకు మూడు టన్నుల రాయితీ టమాటాలు దిగుమతి చేయడం జరిగిందని బుధవారం మార్కెటింగ్ శాఖ అధికారులు తెలియజేశారు. ఇందులో భాగంగా ఏలూరు నగరంలోని పత్తేబాద రైతు బజారుకు 1. 50 టన్నులు, ఒకటో పట్టణ రైతు బజారుకు 750 కిలోలు, కైకలూరు రైతు బజారుకు 500 కిలోలు చొప్పున కేటాయించినట్లు తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.