ఏలూరు ప్రభుత్వ ఐటీఐ డిఎల్టిసిలో అక్టోబర్ 22న జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు సహాయ సంచాలకులు ఎస్. ఉగాది రవి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి ఆఫీస్ ఆధ్వర్యంలో 180 ఉద్యోగాలకు ఈ జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళా కు 10వ తరగతి, ఇంటర్, ఐ. టీ. ఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలతో 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు జాబ్ మేళాకు రావాలన్నారు.