ఏలూరు జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) సోమవారంతో ముగిశాయి. ఈ నెల 3న ప్రారంభమైన పరీక్షలు సెలవు రోజుల్లో మినహా నిరంతరాయంగా సాగాయని డీఈవో ఎస్. అబ్రహం తెలిపారు. సోమవారం జిల్లాలోని ఒక కేంద్రంలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 186 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 166 మంది హాజరయ్యారని మధ్యాహ్నం పరీక్షకు 96 మందికి 71 మంది హాజరయ్యారన్నారు.