పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ నిబంధనలను ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో శ్రీస్వామి వారు ఉదయం 6: 30గం నుండి మధ్యాహ్నం 2 గం వరకు భక్తులకు దర్శనం చేసుకోవాలన్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు గురువారం మీడియాకు తెలిపారు. అటు భక్తుల అభీష్టం మేరకు ఆన్లైన్లో సేవా రుసుము చెల్లించి శ్రీవారి సేవలో పరోక్షముగా పాల్గొనవచ్చని సూచించారు.