సొసైటీ ఫర్ విజ్ఞాన స్వయం సమృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

147చూసినవారు
సొసైటీ ఫర్ విజ్ఞాన స్వయం సమృద్ధి  సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
ఏలూరు పరిసర ప్రాంతం లో సొసైటీ ఫర్ విజ్ఞాన స్వయం సమృద్ధి స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో కొంతమంది పేదవారికి పౌష్టిక ఆహార పదార్థాలు పంపిణీ చేయడం జరిగింది. సంస్థ అధ్యక్షులు గండగత్తెర సుధాకర్ మాట్లాడుతూ నిరుపేదలకు ఆహార పదార్థాలు పంపిణీ చేయడం, స్వయం ఉపాధి కల్పించడం, డ్రాప్ అవుట్ పిల్లలను పాఠశాలలో జాయినింగ్ చేయించడం వికలాంగులకు, వృద్ధులకు సహాయ సహకారాలు అందించడం, వారికి ఉపాధి కల్పించడం ఇటువంటి 26 కార్యక్రమాలు మా ఎన్జీవో ద్వారా చేయాలని తలచి ఈరోజు నుండి ఈ కార్యక్రమం ప్రారంభించాం. అందులో భాగంగానే ఏలూరు ప్రాంతం సోమవర్రపాడు రోడ్డు పక్కన డేరాలలో నివాసం ఉంటున్న సంచార జాతులను కలవడం జరిగింది.
వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాము. ఇప్పటికీ పిల్లలను స్కూల్ కీ చాలామంది వెళ్లడం లేదు. వారి కొరకు తదుపరి కార్యక్రమం చేపట్టనున్నాము అని తెలిపారు.యస్ వీ యస్ యస్ ప్రధాన కార్యదర్శి ప్రసాదం శివన్నారాయణ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా వందల వేల మందికి సహాయం చేయాలన్న ఆశయంతో ముందడుగు వేయడం జరుగుతుందని గృహిణి స్త్రీలకు స్వయం ఉపాధి కల్పించాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, మూఢనమ్మకాలు మూఢచారాలు వైదలిగించాలని ఈ కార్యక్రమం ద్వారా మరింత ముందుకు వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కోరే శ్రీలక్ష్మి హాజరై ఆహార పదార్థాలు పంచడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్