తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు మండల పరిషత్ పరిధిలోని, ఐ. పంగిడి గ్రామ పంచాయతీలో సోమవారం జిల్లా పంచాయతీ అధికారి జె. సత్యనారాయణ పర్యటించారు. జగనన్న స్వచ్చ సంకల్పం నిమిత్తం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కి సూచించారు, చెత్త నుండి సంపద తయారి కేంద్రాన్ని పరిశీలించారు. ప్రభుత్వం సుమారు 8 లక్షల విలువచేసే డీజిల్ వాహనాన్ని పంచాయతీ కి అందజేసినందున వాటిని సద్వినియోగ పరచుకొని, ఇంటింటికి తడిచెత్త-పొడిచెత్త విడివిడిగా సేకరించడం ద్వారా ఐ. పంగిడి గ్రామాన్ని చెత్త, మురికి లేని స్వచ్చ గ్రామంగా తీర్చిదిద్దాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమానికి సహకరించవలసినదిగా ప్రజా ప్రతినిధులను కోరారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశముల ప్రకారం ప్రతీ శుక్రవారం, శనివారం గ్రామాలలోనీ డ్వాక్రా మహిళలకు, రైతులకు, వ్యాపారస్థులకు, ప్రతీ ఇంటికి అవగాహనా కల్పించడానికి ర్యాలి నిర్వహించాలని కార్యదర్శులకు సూచించారు. రోడ్లకి ఇరుప్రక్కలా చెత్త కుప్పలు లేకుండా శుభ్రం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కొవ్వూరు డివిజనల్ పంచాయతీ అధికారి భమిడి శివమూర్తి, సర్పంచ్ గోశాల నాగార్జున, ఉప సర్పంచ్ ఉప్పులూరి. నానజీ, వైస్ ఎంపీపీ కొవ్వూరు వీరమళ్ళ నారాయుడు, పంచాయతీ కార్యదర్శి ఉబా. నందిరాజు, వార్డు సభ్యులు, మండలంలోనీ అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది,రామకృష్ణ, క్లాప్ మిత్రస్ మరియు వాలంటీర్ లు పాల్గొన్నారు.