తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: అరిగెల

668చూసినవారు
తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల ను ఆదుకొని, పాడైపోయిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి నష్టపరిహారం అందించి, సకాలంలో రైతాంగాన్ని ఆదుకోవాలని తూ గో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అరిగేల అరుణ కుమారి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం సాయంత్రం కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో వ్యవసాయ క్షేత్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ అధికారులు సకాలంలో స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆమె తెలియజేశారు.

సంబంధిత పోస్ట్