ద్వారకా తిరుమల క్షేత్ర పాలకుడిగా కొనియాడబడుతున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయం లో మహాశివరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో మొదటి రోజు స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలుగా ముస్తాబయ్యాడు తొలుత ఆలయ ముఖ మండపంలో శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు గా అలంకరించారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు దీంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.