'లడ్డూ ముత్య' స్వామీజీని అనుకరించిన శిఖర్ ధవన్!

74చూసినవారు
'లడ్డూ ముత్య' స్వామీజీని మాజీ భారత క్రికెటర్ శిఖర్ ధవన్ అనుకరించారు. కర్ణాటకకు చెందిన 'లడ్డూ ముత్య' అనే స్వామీజీకి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తిరుగుతున్న ఫ్యాన్లను ఆపి వాటి దుమ్మును స్వామీజీ భక్తులకు రాయడం వాటిలో కనిపిస్తోంది. తాజాగా ఆ స్వామీజీలానే తన స్నేహితులు, సిబ్బందితో కలిసి ఇన్‌స్టాలో ఓ రీల్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్