జగనన్న స్వచ్ఛ సంకల్పం

458చూసినవారు
జగనన్న స్వచ్ఛ సంకల్పం
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామ పంచాయతీ పరిధిలో, సర్పంచ్ స్వరూపరాణి అధ్యక్షతన శనివారం జగనన్న స్వచ్ఛ సంకల్ప అవగాహన సదస్సు జరిగింది. ముందుగా గ్రామ మంతటా భారీర్యాలీ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ వెంకట సతీష్, కార్యదర్శి కమలావతి, సచ్చివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వార్డ్ మెంబర్లు, మహిళా సంఘాలు, రైతులు, పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రామప్రజలు పాల్గొన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ తడిచెత్త-పొడిచెత్త వేరుచేసి విడివిడిగా సేకరించాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్గించటానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.గ్రామ దేవత తూట్లమ్మ జాతర సందర్భంగా గ్రామంలో డ్రైనేజీలు రోడ్లు శుభ్రంగా ఉంచడం, గ్రామమంతటా శానిటేషన్ చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా పరిశుభ్రంగా ఉంచటం జరుగుతుందని కార్యదర్శి తెలియపర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్