పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముందుగా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరుడ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద భారీ బాణాసంచా పేల్చి ఎమ్మెల్యే తలారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.