ప.గో జిల్లా పాలకోడేరు మండలంలో ఆరబెట్టిన ధాన్యాన్ని శుక్రవారం జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. శృంగవృక్షం యస్వివియస్ రైసు మిల్లును జిల్లా జాయింటు కలెక్టరు తనిఖీ చేశారు. ధాన్యం తీసుకు వచ్చిన రైతులతో మాట్లాడారు. ధాన్యం తూకం తూసే మిషన్లు పరిశీలించి ఒక బస్తాను వేసి తూకం చూసారు. కొంత ధాన్యం వేసి తేమశాతాన్ని స్వయంగా పరిశీలించారు. రైస్ మిల్లు రిజిస్టర్లు, కంప్యూటర్ డేటాను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.