కొవ్వూరు: షేర్ యాప్ పేరిట భారీ మోసం
కొవ్వూరు టౌన్‌కు చెందిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ శ్రీనివాస్ షేర్ యాప్ ద్వారా రూ. 29. 30 లక్షలు పోగొట్టుకున్నాడని టౌన్ సీఐ విశ్వం మంగళవారం తెలిపారు. శ్రీనివాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో మోతిలాల్ అశ్వాల్ ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ అనే షేర్ మార్కెట్ యాప్ ద్వారా 4 బ్యాంకు ఖాతాలకు రూ. 29. 30 లక్షలను చెల్లించారన్నారు. తన షేర్స్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా జమ కాలేదన్నారు. కేసు నమోదు చేశామన్నారు.