కొవ్వూరు: అపరిశుభ్ర మరుగుదొడ్లు రహిత జిల్లాగా గుర్తింపు
తూ. గో జిల్లాలో అపరిశుభ్రమైన మరుగుదొడ్లు లేని జిల్లాగా ప్రకటించడం జరిగిందని కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీలో రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు పురపాలక సంస్థల పరిధిలో సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సర్వేలో జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ ఎవ్వరూ లేరని, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు లేని జిల్లాగా నివేదికలు అందాయన్నారు.