చాగల్లు మండలం చాగల్లులో గల పాత పాటమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాలు ముగింపు సందర్భంగా బుధవారం అమ్మవారిని గ్రామంలోని పురవీధులలో మేళ తాళాలు బాజా భజంత్రీలు గరగ నృత్యాలు డప్పు వాయిద్యాలతో అమ్మవారిని ఉరేగింపు జరిపారు. భక్తులు అమ్మ వారికి పండ్లు, పలహారాలు సమర్పించారు.