జిల్లాను ప్రత్యేక స్థానంలో నిలిపేందుకు "విజన్ 2047" డాక్యుమెంట్ రూపకల్పన పై ప గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అధికారులతో సమావేశమై, అమలవుతున్న కార్యక్రమాల పురోగతి, రాష్ట్ర స్థాయిలో చర్చించాల్సిన అంశాలు, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చర్చించిన అంశాలపై సమీక్ష చేసి దిశానిర్దేశం చేశారు.