తణుకు మండలంలోని వేల్పూరు గ్రామంలో శ్రీధనలక్ష్మి రైస్ మిల్లును జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు భరోసా కేంద్రం నుండి వచ్చిన రసీదులను, రిజిస్టర్లను ఆయన తనిఖీ చేశారు. గోడౌన్ లో ఉన్న ధాన్యం నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాహనాల ద్వారా మిల్లులకు వచ్చాక ఆలస్యం లేకుండా దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.