మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం, పేరుపాలెం బీచ్లో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం పర్యాటకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. బీచ్ ప్రాంతం భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడింది. ఎస్సై జి. వాసు ఆదేశాలపై హోం గార్డ్ రామారావు మైక్ ద్వారా హెచ్చరికలు అందించడం వల్ల వేలాది పర్యాటకులు జాగ్రత్తలు తీసుకున్నారు. 10,000 మంది పర్యాటకులు చేరుకున్నారని అధికారులు తెలిపారు.