దర్బరేవు డ్రైన్ ఆయకట్టు రైతులకు సమస్య లేకుండా ఉండేందుకు తమ ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ విప్, స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ అన్నారు. మంగళవారం మొగల్తూరు పంచాయతీ పరిధి కొత్త కాయల తిప్ప గ్రామంలో దర్బరేవు డ్రైన్ ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు.