వెనుకబడిన జాతులను నాగరికంగా తీర్చిదిద్దేందుకు వారిని అన్ని విధాల ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఇరగవరం మండలం కావలిపురం శివారు ఎస్. టి కాలనీలో నివాసం ఉంటున్న యానాదులు, ఉప్పరల కుటుంబాలను ఆయన స్వయంగా కలిసి వారి జీవన విధానాన్ని, అనుసరించే మార్గములను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు.