సంక్రాంతి పండుగ పురస్కరించుకుని నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 120 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకట సురేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడిపందాలు, గుండాట వంటి జూదాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. సంక్రాంతిని తల్లితండ్రులు, బంధువులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఎక్కడైన పందాలు నిర్వహిస్తే 100, 112 నంబర్లకు సమాచారం అందించాలన్నారు