నరసాపురం పురపాలక సంఘ పారిశుద్ధ్యం పనులలో భాగంగా పట్టణ ప్రధాన డ్రైనేజీ లను మున్సిపల్ కమీషనర్ ఎం.అంజయ్య మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ అంజయ్య మాట్లాడుతూ.. మురుగు నీటి సమస్యలు లేకుండా ప్రతి రోజు డ్రైనేజీలు పరిశుభ్రం చేసే పనులను శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నారు. మురుగు నీరు లేకుండా చేయడం వల్ల దోమల సమస్య రాదని, ప్రజలు అంటూ రోగాల భారిన పడకుండా ఉంటారని తెలిపారు. డ్రైనేజీలలో చెత్తాచెదారం, కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు వేయకుండా చూడాలసిన బాధ్యత స్థానికులపై ఉందన్నారు.