ఒకే దేశం, ఒకే ఎన్నిక ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని దీని వల్ల రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయని సిపిఎం పొలిటి బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గురువారం నరసాపురంలో సీపీఎం రాష్ట్ర సమావేశలకు విచ్చేసిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సైతం ప్రవేశ పెట్టారన్నారు.