ప్రజలకు మేలైన సర్వీసులు అందజేయడంలో రెవెన్యూ సిబ్బంది ముందు వరుసలో ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఇరగవరం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయము రికార్డు రూమును పరిశీలించారు. మండలంలోని 14 గ్రామాల్లో పూర్తయిన రీ సర్వే గురించి ఆరా తీశారు. రీ సర్వే గ్రామ సభలలో గ్రామాల వారీగా వచ్చిన ఫిర్యాదుల గురించి అడిగి తెలుసుకున్నారు.