భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే వరకట్న వ్యతిరేక దినోత్సవం అని ప్యానల్ లాయర్ పద్మజ అన్నారు. నర్సాపురం మండల న్యాయ సెవాధికార సంస్థ ఆధ్వర్యంలో లక్ష్మనేశ్వరంలో మంగళవారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరకట్నం అనేది సాంఘిక దురాచారమని చట్టపరంగా ఎన్ని శిక్షలు ఉన్నప్పటికీ వరకట్న వేధింపులకు గురవుతూనే ఉన్నారన్నారు. నేటి రోజుల్లో ఈ చట్టాన్ని చాలా వరకు దుర్వినియోగం చేస్తున్నారని పద్మజ పేర్కొన్నారు.