నరసాపురం పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందివ్వడమే కాకుండా మంచి నీటి శుద్ధి కేంద్రంలో క్లోరినేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ అంజయ్య వాటర్ వర్క్స్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా 18,24,25,31వ వార్డులలో కుళాయిలు ద్వారా వచ్చే మంచి నీటిని మంగళవారం పరిశీలించి మాట్లాడుతూ త్రాగే నీరులో ఆలమ్, క్లోరిన్ తగిన మోతాదులో వినియోగిస్తూ అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.