అక్రమ తవ్వకాలపై చర్యలు తప్పవు: కలెక్టర్

64చూసినవారు
అక్రమ తవ్వకాలపై చర్యలు తప్పవు: కలెక్టర్
జిల్లాలో అనధికారిక ఇసుక అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా ఉచిత ఇసుకపై పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో ఇసుక అందుబాటులో లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్