నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో బడ్డీ కొట్టుకు నిప్పు పెట్టారు. దీనిపై బాధితురాలు శనివారం నూజివీడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తులిమిల్లి ప్రశాంతి అనే మహిళ బట్టి కొట్టుకు అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నిప్పు పెట్టినట్లుగా బాధితురాలు ఆరోపిస్తుంది. పెట్రోల్ పోసి ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు వాపోతోంది.