విజయవాడ వరద బాధితుల సహాయార్దం దాతలు ఇచ్చిన ఆహారం, ఇతర నిత్యవసర సామగ్రిని పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం నుండి శుక్రవారం ప్రత్యేక వాహనంలో విజయవాడకు పంపామని తహశీల్దార్ వై. దుర్గా కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా సరుకులను తరలించే వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు ఆపద కాలంలో, దాతలు సహాయం చేసి ఆదుకునే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు