పాలకొల్లు: టిడ్కో గృహ వాసుల కోసం మంత్రి కొత్త వాహనం ఏర్పాటు

64చూసినవారు
పాలకొల్లులోని టిడ్కో గృహాల కాలనీ వాసులకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ప్రయాణ వాహనం ప్రారంభించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం తెలిపారు. కాలనీ వాసులు వివిధ పనుల నిమిత్తం గాంధీ బొమ్మల సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే దూరం కావడం వల్ల, ముఖ్యంగా మహిళలు నడిచి వెళ్ళవలసి వస్తుందని ఆయన అన్నారు. కొత్త వాహనం మహిళలకు సహాయంగా ఉపయోగపడుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్