పాలకొల్లు నియోజకవర్గంలో పల్లె పండుగ వారోత్సవాలు జోరుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పాలకొల్లు మండలం గోరింటాడ గ్రామంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఓ. హెచ్. ఆర్ తో పాటు పలు అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేశారు. బాపూజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఎన్డీఏ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. గ్రామ సర్పంచి మండెల పావని, మండెల నాని, మండెల త్రిమూర్తులు, కార్యదర్శి గాయత్రి పాల్గొన్నారు.