పోడూరు: సంక్షేమం, అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ముందంజ: మంత్రి నిమ్మల.

72చూసినవారు
పోడూరు: సంక్షేమం, అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ముందంజ: మంత్రి నిమ్మల.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందంజలో ఉందని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలంలో రూ. 45 లక్షల వ్యయంతో రోడ్లు, డ్రైన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. గత ప్రభుత్వంలో గ్రామాలకు అభివృద్ధి లేకపోతే, కూటమి ప్రభుత్వం హామీల అమలుతో అభివృద్ధి పనులు మొదలు పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, సర్పంచ్, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్