ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా గురువారం యలమంచిలి మండలం తహసీల్దార్ ఆఫీస్ వద్ద నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ చార్జీలు తగ్గింపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.