బయ్యనగూడెం గ్రామంలో బి సి కమ్యూనిటీ హాల్ నందు గ్రామంలో నివసిస్తున్న 21 బి సి వర్గాలకు చెందిన కులాల వారు బిసీ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశం నందు త్వరలో గ్రామానికి ప్రస్తుత మరియు గత ప్రభుత్వల్లో బీసీ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులను, వివిధ నామినేటెడ్ పదవులలో ఉన్న ప్రజాప్రతినిధులు వివిధ హోదాల్లో ఉన్న అధికారులను బీసీ కులాలకు చెందిన పెద్దలను ఆహ్వానించి భారీ బహిరంగ సభాకు ఏర్పాటు కార్యచరణ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా బి సి కమ్యూనిటీ హాల్ శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామంలో ఉన్న బీసీ కుల సంఘాలు మరియు వారి ప్రతినిధులు అప్పటికప్పుడు సుమారు 10 వేల రూపాయల అందించి తక్షణం మరమ్మతులు చేయడానికి ప్రణాళిక చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని బీసీ వర్గాలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు.