పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను అధ్యయనం చేసేందుకు శనివారం పోలవరం విచ్చేసిన కేంద్ర జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుగా ప్రాజెక్ట్ లోని స్పిల్ వేని పరిశీలించింది. అనంతరం ఎగువ, దిగువ కాఫర్ డాం పనులను పరిశీలించింది. అనంతరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించింది. డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించి జనవనరుల అధికారులను, ప్రాజెక్ట్ ఇంజినీర్లను కమిటీ చైర్మన్, సభ్యులు అడిగి తెలుసుకున్నారు.