ఈదురు గాలులు బీభత్సం తో నేలకొరిగిన మొక్కజొన్న పంట

2437చూసినవారు
ఈదురు గాలులు  బీభత్సం తో నేలకొరిగిన మొక్కజొన్న పంట
కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో ఇటీవల కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి మొక్కజొన్న పంట నేల కొరకడంతో పంటను తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు మాట్లాడుతూ ఈదురు గాలులుతో కూడిన అకాల వర్షాలు కారణంగా నేలకొరిగిన మొక్కజొన్న మరియు వర్జీనియా పొగాకు రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు పంట చేతికొచ్చే సమయంలో దెబ్బతిన్న కారణంగా తీవ్ర నిరాశకు గురవుతున్నారన్నారు. ఇప్పటికే కరెంటు కోతల కారణంగా రైతులు సగం నష్టపోగా ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్నరు అన్నారు.

వెంటనే ప్రభుత్వం స్పందించి అధికారుల ద్వారా దెబ్బతిన్న పంటల యొక్క నివేదికలు తెప్పించుకుని పంటకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, చింతల వెంకటేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ తెలుగు యువత సెక్రటరీ నల్లూరి గోపి, ఏలూరు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి పారేపల్లి పవన్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్