జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కార్తీకమాసం కావడంతో స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.