తాడేపల్లిగూడెం ఇస్కాన్ మందిరంలో బలరాం జయంతి

67చూసినవారు
తాడేపల్లిగూడెం పట్టణం సత్యవతి నగర్ లోని ఇస్కాన్ మందిరంలో సోమవారం బలరామ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మంగళ హారతి, శృంగారదర్శన హారతి, గురుపూజ, అభిషేకం, ప్రవచనం వంటి కార్యక్రమాలను జరిపారు. టెంపుల్ అధ్యక్షుడు మురళి నాథ్ శ్యామ్ రామ్ ప్రభు జి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 26న కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు మురళీనాథ్ తెలిపారు. భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్