తాడేపల్లిగూడెం: అత్తింటి వేధింపులే కారణమా..?

57చూసినవారు
తాడేపల్లిగూడేనికి చెందిన వివాహిత వైష్ణవి (28) గోదావరి ఏలూరు ప్రధాన కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏలూరు కాలువలో గాలించగా మృతదేహం లభ్యమైంది. శనివారం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అత్తింటివేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే నిందితులకు కఠిన శిక్ష విధించాలన్నారు.

సంబంధిత పోస్ట్