తాడేపల్లిగూడెం: చెస్ పోటీల్లో ప్రతిభకనబర్చిన లోటస్ స్కూల్ విద్యార్థి రిత్విక్

56చూసినవారు
తాడేపల్లిగూడెం: చెస్ పోటీల్లో ప్రతిభకనబర్చిన లోటస్ స్కూల్ విద్యార్థి రిత్విక్
ఇంటర్నేషనల్ ఫిడే రాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్లో తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి లోటస్ పాఠశాలకు చెందిన ఎస్. రిత్విక్ 1547వ ర్యాంకు సాధించాడు. అలాగే, అండర్-9 విభాగంలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ దేవి ప్రియ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి రిత్విక్ ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అభినందించారు. ఈ నెల 19వ తేదీన జరగనున్న పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్