పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని 20వ వార్డులో వ్యాపారస్తులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్వనిధి కూడా–స్వభిమానం కూడా అనే అంశంతో డిసెంబరు 2 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 8 పథకాలపై అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో యూనియన్ బ్యాంకు మేనేజర్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.