హక్కులు సాధనకై సైకిల్ యాత్ర

655చూసినవారు
హక్కులు సాధనకై సైకిల్ యాత్ర
బేడబుడగ జంగం కులానికి చెందిన మాకు, కుల సర్టిఫికెట్ ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహించడం వల్ల, సంక్షేమ పథకాలు అందటం లేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్సమెంట్ రాక చదువుకోవడం కష్టతరంగా మారిందని ఆంధ్రప్రదేశ్ బేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి. మధు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నో సంవత్సరాలగా యాచిస్తూ సంచార జీవనం గడుపుతూ సమాజంలో గుర్తింపు, విలువ లేని కులంగా మిగులుపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కుల సర్టిఫికెట్ ఇప్పించి అభివృద్ధికి నోచుకోని మా బేడబుడగ జంగం కులాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జె. సి. శర్మ కమీషన్ నివేదికను ఆమోదించి ఎస్సీలుగా చట్టబద్ధత కల్పించి కుల సర్టిఫికేట్ వెంటనే జారీచేయాలన్నారు.

బేడబుడగ జంగం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలన్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో అవకాశాలు కల్పించాలని కోరారు.
13సంఃలుగా రిజర్వేషన్ నష్టపోయినందుకు ప్రతీ కుటుంబానికి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఈ సైకిల్ యాత్రలో రాష్ట్ర నాయకులతో పాటు, జిల్లా, డివిజన్, మండల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్