ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన జగన్: మాజీ ఎమ్మెల్యే సతీమణి

65చూసినవారు
ఎన్నికలకు ముందు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన వైయస్ జగన్ అధికారంలోకి రాగానే హామీలను గాలికి వదిలేసారని తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణతులసి అన్నారు. శుక్రవారం అత్తిలి మండల కేంద్రంలో టిడిపి-జనసేన-బిజెపి కూటమి తరుపున ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లిన ఆమె కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. మాట తప్పిన మడమ తిప్పిన మనిషిగా జగన్ మిగిలిపోయారని అన్నారు.

సంబంధిత పోస్ట్