అత్తిలి మండలం మంచిలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం సందర్భంగా విశేషంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు వేకువజామునే విచ్చేసి స్వామి వారి పూజలో పాల్గొన్నారు. పూజలు అనంతరం అఖండ అన్నసమారాధన నిర్వహించగా, మంచిలి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విచ్చేసి, స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు.