తణుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన దాడులలో వేల్పూరు గ్రామానికి చెందిన గుమ్మడి రాజు(58)ని బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద నుండి 6 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐ బి. లక్ష్మీ, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.