భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం అని తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి చిత్రపటానికి నివాళులర్పించడమైనది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. భారతదేశ ఆర్థిక చరిత్రను కీలక మలుపు తిప్పి, ఎన్నో సంస్కరణలకు ఆధ్యుడు మన్మోహన్ సింగ్ అని అన్నారు.