తణుకు: యానాదులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని జయంతి కాలనీలో నిరుపేదలైన యానాదులకు ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీపీఎం పట్టణ కార్యదర్శి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ పర్యటించి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఎన్ని ప్రభుత్వాలు మారినా యానాదుల జీవితాలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.