తణుకు కార్పొరేషన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్లో పిల్లలు అసౌకర్యకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. తినలేని ఆహారం, అశుభ్రమైన బాత్రూమ్స్, చుట్టూ చెత్త పేరుకుపోవడంతో పిల్లలు దోమలతో బాధపడుతున్నామంటూ విద్యార్థులు వాపోతున్నారు. ఈ సమస్యపై ఎన్ని సార్లు వార్డెన్ కి చెప్పిన స్పందించడం లేదని అక్కడి పిల్లలు వాపోతున్నారు. అధికారులు వార్డెన్ శ్రీనివాసరావు, అటెండర్ రామకృష్ణ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.