అత్తిలి రైల్వేస్టేషన్‌లోని రైల్వే విద్యుత్ స్తంభంపై నుంచి పడి మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు భీమవరం రైల్వే హెడ్‌కానిస్టేబుల్ లచ్చన్న శనివారం తెలిపారు. మతి స్థిమితం లేకుండా తిరుగుతున్న గుర్తుతెలియని వ్యక్తి అత్తిలి రైల్వేస్టేషన్‌లోని విద్యుత్ స్తంభం ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడి మృతిచెందాడు. ఆచూకీ తెలిసిన వారు 9705649492 సమాచారం అందించాలన్నారు.